- నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడే స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరమ్మతుల కారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.