
నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి, జిల్లా పరిషత్ పాఠశాల, డీఈఓ కార్యాలయం ఆవరణలో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంట్ సరాఫరాకు అంతరాయం కల్గింది. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.