హైదరాబాద్లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం

  • నాచారంలో 11.1 సెం.మీ, ఉప్పల్ లో 9.2 సెంమీ, కాప్రాలో 8.4 సెం.మీ నమోదు

హైదరాబాద్: మహానగరంలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల పెద్ద పెద్ద చినుకులతో భారీ వర్షం పడింది. అర్ధరాత్రి 12 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నగరంలోని పలుచోట్ల అత్యధికంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. 

నాచారం పరిసర ప్రాంతాల్లో 11.1 సెంటీమీటర్లు

ఉప్పల్ చిలకానగర్ ప్రాంతంలో  9.2 సెంటీమీటర్లు

ఉప్పల్ మారుతి నగర్  ప్రాంతంలో 9.1 సెంటీమీటర్లు

కాప్రా ప్రాంతంలో 8.4 సెంటీమీటర్లు

ఎల్బీనగర్ ప్రాంతంలో 7.7 సెంటీమీటర్లు

సరూర్ నగర్ అల్కాపురి కాలనీ 7.1 సెంటీమీటర్లు

మల్కాజ్ గిరి పరిసరాల్లో 6.3 సెంటీమీటర్లు

సైదాబాద్ ప్రాంతంలో 5.6 సెంటీమీటర్లు

అస్మాన్ ఘడ్ మలక్ పేట 5.6 సెంటీమీటర్లు

సరూర్ నగర్ ప్రాంతంలో 4.5 సెంటీమీటర్లు

మౌలాలి ప్రాంతంలో 4.4 సెంటీమీటర్లు

అంబర్ పేట ప్రాంతంలో 3.1 సెంటీమీటర్లు

హయత్ నగర్ ప్రాంతంలో 2.2 సెంటీమీటర్లు

బహదూర్ పుర ప్రాంతంలో 1.4 సెంటీమీటర్లు

నాంపల్లి ప్రాంతంలో 1.1 సెంటీమీటర్లు