రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. గాలితో పాటు..వడగండ్లు పడటంతో చాలా చోట్ల పంట వరి నేలకొరిగింది. కీసర మండలం కేంద్రంలోని దాయారంలో మామిడి పూర్తిగా రాలిపోయింది. అటు రోడ్లపై భారీ చెట్లు నెలకొరిగాయి. అటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో కూడా రాత్రి కురిసిన వర్షానికి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావటంతో….సర్కార్ ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి వాన బీభత్సంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈదురు గాలులతో విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనగామ జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇటు మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.