హైదరాబాద్లో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు.. కూకట్పల్లిలో ట్రాఫిక్ జాం..

హైదరాబాద్లో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు.. కూకట్పల్లిలో ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి.  పులు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాలలో గాలి ఉరుములతో వర్షం కురుస్తోంది. 

మరోవైపు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, పాత బస్తీ, మలక్ పేట, నాంపల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 

కూకట్ పల్లి ఏరియాలో కూడా భారీ వర్షం పడుతోంది. కూకట్ పల్లి , కేపి.హెచ్.బీ, నిజాంపేట, మూసాపేట్, హైదర్ నగర్ లో భారీ వర్షం పడుతోంది. వాన తాకిడికి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు నీట మునగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.