తిరుమలలో కుండపోత వర్షం : వీధులు జలమయం.. షాపుల్లోకి పోటెత్తిన వరద

తిరుమలలో కుండపోత వర్షం : వీధులు జలమయం.. షాపుల్లోకి పోటెత్తిన వరద

 తిరుమలలో గురువారం అర్దరాత్రి  ( అక్టోబర్​17) వాన  దంచికొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  దీంతో కొండపై ఉన్న షాపులు నీట మునిగాయి. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

వాయుగుండం ప్రభావం  తిరుమల కొండపై భారీ వర్షాలు పడుతున్నాయి.  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గురువారం ( అక్టోబర్​ 17) అర్దరాత్రి ఉరుములు.. మెరుపులతో భారీ వర్షం పడింది,  తిరుమల కొండపై  ఉన్న దుకాణాలను వరద నీరు ముంచెత్తింది.  షాపుల్లోని సామాగ్రి తడిచింది.

Also Read :- బీఆర్ఎస్​ కీలక నేత బంధువులపై కేసు నమోదు

గురువారం ( అక్టోబర్​ 17)పగటి వేళ ఎండ,  ఉక్కపోతతో భక్తులు అల్లాడిపోయారు. అయితే  గురువారం రాత్రి మళ్ళి భారీ వర్షం కురిసింది. దీంతో  తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఘాట్ రోడ్లలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి అధికారులు సూచిస్తున్నారు..