
కలియుగ వైకుంఠం తిరుమలలో వర్షం దంచికొట్టింది.. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ( మార్చి 11 ) సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తిరుమలలో దుకాణాలు నీటి మునిగాయి.గత కొన్ని రోజులుగా ఓ వైపు మండిపోతున్న ఎండలు, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఈ భారీ వర్షం కాస్త ఉపసమాంమ్ ఇచ్చిందనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో జనం వేసవి తాపం తట్టుకోలేక నానా తంటాలు పడుతూ భయటికి రావాలంటేనే భయపడుతున్న క్రమంలో. తిరుమలలో మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండు వేసవిలో సైతం ఒక్కసారిగా కురిసిన వర్షానికి తిరుమల కొండపై వాతావరణం చల్లబడింది. వర్షంలో తిరుమల గిరుల అందాలను చూసిన వెంకన్న భక్తులు తనివితీరా ఆస్వాదించారు.
ఓ పక్క వెంకన్న నామస్మరణ.. మరోపక్క మనసును ఆహ్లాదపరిచే జడివానలో పరవశించిపోయారు శ్రీవారి భక్తులు. భారీ వర్షంలో తిరుమల అందాలను వీడియోలు, ఫోటోల్లో బంధిస్తున్నారు. ఓ పక్క భక్తి భావం, మరోపక్క వర్షానికి ప్రకృతి అందాలన్ని తిరుమల కొండపై ఒకేచోట రాశి పోయినట్లు ఉండటంతో కళ్ళు తిప్పుకోలేకపోతున్నామని అంటున్నారు భక్తులు.