- జలమయమైన రాజన్న ఆలయ పరిసరాలు
వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణంలో మధ్యాహ్నం ఎకధాటిగా రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పట్టణంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ పరిసరాల్లో వర్షం కారణంగా ప్రధాన రహదారి పూర్తిగా జలమయం అయింది.
దుకాణాల్లోకి వరద నీరు వెళ్లడంతో సామానులు పూర్తి తడిసిపోయాయి. కొంతకాలంగా ఉక్కపోతగా ఉండగా వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది.