వరంగల్ నగరంలో శుక్రవారం ఆగస్టు 23, 2024 సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారింది. అప్పటికప్పుడు మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటలకు మొదలైన వర్షం దాదాపు గంటపాటు దంచికొట్టింది. దీంతో వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఆగస్టు 23నుంచి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.