ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. హనుమకొండ, కాజీపేట, భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట మండలాల్లో ఈదురు గాలులతో వర్షం పడుతోంది.   దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. 

 ఇక ఆసిఫాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.  భారీ వర్షానికి  చెట్టు, విద్యుత్‌ స్తంభం నేలకూలింది.  విద్యుత్‌ స్తంభం నేలకొరగడంతో ఆసిఫాబాద్‌లో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.   

అటు  బెల్లంపల్లి పట్టణం తిలక్ స్టేడియంలో భారీ ఈదురుగాలులకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం టెంట్లు కుప్పకూలిపోయాయి.  నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి  గ్రామంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.