మహబూబాబాద్/ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరంగల్, మహబూబాబాద్జిల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్జిల్లాలలో ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తొర్రూరు మండలం అమ్మాపురం పెద్ద చెరువు మత్తడి పోస్తుంది. కాగా, జిల్లాలో లోలెవల్వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తున్నందున ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్అద్వైత్కుమార్సింగ్ కోరారు. ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
లక్నవరం సరస్సు మత్తడి దుంకుతోంది. భారీ వర్షాలకు గోవిందరావుపేట మండం కల్నవరం సరస్సులోకి భారీగా వరద గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులోకి భారీగా వరద చేరడంతో 33.5 అడుగుల నీటిమట్టానికి చేరుకోవడంతో
మత్తడి పారుతోంది.