బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వానలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ , మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి , రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి , జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడకక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేసింది.
జగిత్యాల జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నిన్నటి(సెస్టెంబర్ 03) నుంచి కురుస్తున్న వర్షానికి కోరుట్ల వాగు కొట్టుకుపోయింది. దీంతో కోరుట్ల మండలం కల్లూరు పైడిమడుగు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై ఉన్నలో లేవల్ బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుంది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్, ప్రకాశం రోడ్డు, ముత్యాలవాడ ప్రాంతాలు జలదిగ్భధంలో ఉండిపోయాయి.
అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా (సెప్టెంబర్ 04) ఉదయం నుంచి పడుతున్న వాన పడుతోంది. పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.
మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెం. మీ, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 5.5 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షం పడుతోంది. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపుర్ లో అత్యధికంగా 150.8 మిల్లీ మీటర్లు, ఇల్లంతకుంటలో 118 మిల్లీ మీటర్లు, --కొనారావుపేటలో 100 మిల్లీ మీటర్లు, విర్నపల్లిలో 99 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -వేములవాడ మూలవాగు పొంగి పొర్లింది. -హన్మజిపేట నక్క వాగు ఉదృతంగా ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విర్నపల్లి మండలంలోని గర్జనపల్లి వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది.