ఢిల్లీ-నోయిడా రోడ్లు జలమయం.. పాఠశాలలు బంద్

దేశ రాజధానిలో మరోసారి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నోయిడాతో సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత కొన్ని రోజులుగా యమునా అలాగే హిండన్ నదుల నీటి మట్టం పెరగడం వల్ల ఇప్పటికే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆ ప్రాంతంలోని ప్రజలు.. ఇప్పుడు నీటి ఎద్దడి, ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది.  

ALSO READ :నేడు మోదీ సర్కార్​పై అవిశ్వాసం

విరామం లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇక భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఈ ప్రాంతంలో హెచ్చరిక జారీ చేసింది. రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

#WATCH | UP: Noida wakes up to rain lashing parts of the city

(Visuals from Noida Sector 20) pic.twitter.com/MMBJ7ExuAa

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2023