
యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కురిసింది. దీంతో మోత్కూరు మార్కెట్‌తోపాటు పలు కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిచిపోయాయి. వడ్ల కుప్పలపై కవర్లు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల తడవగా, కవర్లు ఉన్పప్పటికీ.. కింది నుంచి వచ్చిన వాన నీటితో వడ్లు కొట్టుకొని పోయాయి.
కాగా జిల్లాలోని మోత్కూరులో అత్యధికంగా 44.5 మిల్లి మీటర్ల వాన కురిసింది. ఆ తర్వాత ఆలేరులో 31.8, వలిగొండలో 19.5 మిల్లీ మీటర్ల వాన పడింది. అత్యల్పంగా చౌటుప్పల్‌లో 0.5 ఎంఎం వాన కురిసింది.