హైదరాబాద్‌లో మళ్లీ వర్షాలందుకున్నాయి. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్ హౌస్, రాజేంద్రనగర్, అత్తాపూర్, శంషాబాద్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.