దుబాయ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు దుబాయ్ లో జనజీవనం స్తంబించింది. నిన్న సాయంత్రం ఒక్క సారిగా ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో దహదారులు నీట మునిగాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్టు సైతం నీటమునిగింది. ఈ క్రమంలో భారత్, దుబాయ్ మధ్య 28 విమానాలను రద్దు చేసినట్లు పౌర విమానాయన శాఖ తెలిపింది. వీటిలో దుబాయ్ కు వెళ్లేవి 15 కాగా అక్కడి నుంచి వచ్చేవి 13 ఉన్నాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులకు సమాచారం అందించినట్లుగా అధికారులు వెల్లడించారు. దుబాయ్ ఎయిర్‌పోర్టుకు అవసరమైతే తప్ప రావద్దని ప్రయాణికులను హెచ్చరించింది.
దుబాయ్ లో సుమారు 120 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. అబుదాబి, షార్జాతో సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరిక లు జారీ చేసింది. భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్ లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రోడ్లపై కార్లు కొట్టుకుపో తున్న దృశ్యాలు సైతం కనిపించాయి. ఒమన్ లో 18 మంది మృతి ఒమన్లోనూ మూడు రోజులుగా కురు స్తున్న భారీ వర్షాలకు 18 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మస్కత్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా రహదారులు స్తంభించాయి. 1949 తరువాత దుబాయ్ లో ఇదే అత్యధిక వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.