ఏటూరునాగారం ఏజెన్సీలో ఈదురు గాలులతో  భారీ వర్షం

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలోని 163 జాతీయ రహదారిపై అడ్డంగా భారీ చెట్టు విరిగిపడింది. దీంతో భారీగా ట్రాఫిక్​జామ్​ అయ్యింది. స్థానికులు, ప్రయాణికులు చెట్టును తొలగించడంతో సమస్య పరిష్కారమయ్యింది.