మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో… చాలా గ్రామాలు నీట మునిగాయి. మహారాష్ట్రలోని గచ్చిరోలిలో పలు గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పడవల సాయంతో బయటకు వెళ్తున్నారు గ్రామాల ప్రజలు. రవాణా సౌకర్యం కూడా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు మధ్య ప్రదేశ్ లోని రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. భోపాల్ లో ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. మోకాల లోతు వరకు నీళ్లు చేరటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు ఉత్తరాఖండ్ లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో మూడు ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
Maharashtra: Gadchiroli faces a flood-like situation following heavy rainfall. pic.twitter.com/nP7TyPrATt
— ANI (@ANI) September 8, 2019