ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు..50 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.   మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు. 150 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారికి సహాయం అవసరమని అన్నారు. 

ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్రాంతానికి బృందాలు మరియు హెలికాప్టర్లను పంపిందని అయితే హెలికాప్టర్లలో నైట్ విజన్ లైట్ల కొరత కారణంగా, ఆపరేషన్ విజయవంతం కాకపోవచ్చు అని ఖానీ చెప్పారు.  వరదలు వివిధ జిల్లాల్లోని ఇళ్లు, ఆస్తులను కూడా దెబ్బతీశాయని బాగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ తెలిపారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. 

రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు. రెస్క్యూ బృందాలు, ఆహారం మరియు ఇతర సహాయాన్ని తీసుకుని, ప్రభావిత ప్రాంతాలకు పంపించబడ్డాయని ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌పైనే ప్రధాన దృష్టి ఉందని, ప్రాణనష్టం మరియు నష్టంపై తర్వాత తెలుపుతామని అన్నారు.