వర్షాలు 15 రోజులు గెరువిచ్చాయో లేదో.. మళ్లీ వస్తా.. వస్తా అంటూ వచ్చేస్తున్నాయ్. తెలంగాణలోకి వీ ఆర్ బ్యాక్ అంటూ వరుణ దేవుడు కుండపోతగా కురవడానికి రెడీ అయ్యాడు.
రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్టు 18,19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆ రోజుల్లో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 14న ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 70.3 మి.మీ, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 12.3 మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 466.9 మి.మీ కాగా ఇప్పటికే 582.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఎల్‌నీనో ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షాలు కురిశాయి.