తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ప్రజలు అతలాకుతలం అయ్యారు. వరద బీభత్సానికి రోడ్డు ద్వంసమైయ్యాయి. వంతెనలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వృక్షాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ముంప్పు ప్రాంతం ప్రజలు భయం గుప్పిట్లో ఉండగా.. వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి, కృష్ణ నదులపై ఉన్న పలు నీటి పారుదల ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టు
-
ఇన్ ఫ్లో 54 వేలక్యూసెక్కులు
-
పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు
-
ప్రస్తుతం 1395 అడుగులు.
-
నీటి సామర్థ్యం 17.802 టిఎంసి లు
-
ప్రస్తుతం 7 టిఎంసి లు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
-
ఇన్ ఫ్లో లక్ష 57 వేల 274 క్యూసెక్కులు
-
ఔట్ ఫ్లో 34,853 క్యూసెక్కులు
-
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091,అడుగులు 80.5టిఎంసీలు
-
ప్రస్తుత నీటిమట్టం 1087.9అడుగులు 69.57టీఎంసీలు
-
3 గేట్లు ఎత్తి 34వేల 853 క్యూసెక్కుల నీరు విడుదల
కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్
-
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 3,51,970 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు
-
ఇన్ ప్లో ఔట్ ఫ్లో 3,51,970 క్యూసెక్కులు
-
లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు
ALSO READ | కడెం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఓపెన్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్
-
26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
-
(20 గేట్లు 15 ఫీట్లు మరియు 6 గేట్లు10 ఫీట్లు)
-
ఇన్ ఫ్లో 533157 క్యూసెక్కులు
-
అవుట్ ఫ్లో 541435 క్యూసెక్కులు
-
పూర్తిస్థాయి నీటిమట్టం :- 590.00 అడుగులు
-
ప్రస్తుత నీటి మట్టం :- 587.20 అడుగులు
-
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312.0450 టీఎంసీలు
-
ప్రస్తుత నీటి నిల్వ :- 305.6242 టీఎంసీలు
-
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
కుడి, SLBC, LLC కాలువలకు నీటి విడుదల
నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్ట్
-
2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
-
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు.. ప్రస్తుతం 1183 అడుగులు
-
ఇన్ ఫ్లో 9000 క్యూసెక్కులు,
-
2 గేట్లు ద్వారా ఔట్ ఫ్లో 10126క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల