హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నిన్న ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ షరూ చేశాడు. చార్మినార్, ఫలక్‌నుమా, శాస్త్రిపురంలో భారీ వర్షం కురుస్తుంది. అంతేకాకుండా ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మోహిదీపట్నం, కూకట్ పల్లి, పటాన్ చెరులో భారీ వర్షం పడుతోంది.
మరోవైపు రాష్ట్రంలో మూడు రోజుల పాటు అంటే మే 10 నుంచి 13 వరకు తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మొత్తం జిలాల్లకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు