- 37 వేల ఎకరాల్లో పంట నష్టం
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇప్పటిదాకా 33 మంది చనిపోయారు. మరో 18 మంది వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం ఇంకా రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. బీజింగ్ పర్వత ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో 59 వేల ఇండ్లు కూలిపోయాయి.
దీనివల్ల దాదాపు 1.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సుమారు15 వేల హెక్టార్ల పంట భూములు ముంపునకు గురయ్యాయి.100కు పైగా వంతెనలు దెబ్బతినగా.. అనేక రహదారులు కొట్టుకుపోయాయి. వాటిని పూర్తిగా రిపేర్ చేయడానికి మూడేండ్లు పట్టవచ్చని అధికారులు తెలిపారు. బీజింగ్‌కు నైరుతి దిశలో ఉన్న జువోజౌ ప్రాంతంలో వరద తగ్గుముఖం పట్టిందని తెలిపారు.