నిజామాబాద్ జిల్లాలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చేపల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. భారీగా కురిసిన వర్షాలకు చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ చెరువు అలుగు పారుతోంది. చేపలు పట్టేందుకు వెళ్లి గుండారం గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి నీటిలో మునిగి మృతిచెందాడు.
భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజలెవరూ చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. నిజాంసాగర్ మండలం నర్సింగపల్లి నల్ల వాగులో కృష్ణ, మందిపేట్ మండలం షాపూర్ లో ఎల్లప్ప, గుండారం గ్రామానికి చెందిన సాయిరెడ్డి మృతిచెందారు.