
భారత్ , పాక్, చైనా దేశాలతో పాటుగా భారీ వర్షాలు జపాన్ లో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా ఆ దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయారు. ఫుకుయోకాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ 77 ఏళ్ల వృద్దురాలు మరణించింది. ఆమె భర్త స్పృహ కోలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
జపాన్ లోని క్యుషులో భారీ వర్షాలు కురుస్తుండటంతో జపాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, కొండ, నదీతీర ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు తమ నివాసాలను త్వరగా ఖాళీ చేసి సరక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షం కారణంగా పశ్చిమ హిరోషిమా, ఫుకుయోకా మధ్య బుల్లెట్ రైలు సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
జపాన్‌లోని ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాన క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో హాని కలిగించే ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.