
దేశం అంతా ఎండలతో మండుతుంటే.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. కొండ ప్రాంతాలనుంచి వస్తున్న వరదల కారణంగా ఇళ్లు కూలుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్లు దొర్లుతూ వచ్చి ఇళ్లపై పడుతుండటంతో పరిస్థితి భయానకంగా మారింది.
అనూహ్యంగా వచ్చిన వర్షాలతో చిన్న చిన్న నదులను తలపిస్తున్నట్లుగా వరదలు వస్తున్నాయి. ఈ వరదలకు ‘కులు’ జిల్లా అతలాకుతలం అయ్యింది. 24 గంటల పాటుగా ఆగకుండా వస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు.
భారీ వరదలకు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రాళ్లు, రప్పలు, మట్టి కొట్టుకురావడంతో రహదారులు మట్టి దిబ్బలుగా మారిపోయాయి. కార్లు, బైకులు వరదలకు కొట్టుకుపోయాయి. మట్టి దిబ్బలు, రాళ్లు వెహికిల్స్ ను పూడ్చేశాయి.
Also Read:-విరిగిపడ్డ మంచు కొండ .. 47 మంది గల్లంతు..
హిమాచల్ లో వస్తున్న అకాల వర్షాలకు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యల తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. మట్టిలో కూరకుపోయిన వాహనాలను వెలికితీస్తామని, ఇన్సురెన్స్ కల్పిస్తామని చెప్పారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.