తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

 తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం (జూలై 13)ఉదయం నుంచి జూలై 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన  వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

శుక్రవారం సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడింది. రుతుపవనాలు చురుకుగా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

ALSO READ | న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ తరహాలో..హైదరాబాద్ లో వీడియో బిల్ బోర్డులు