Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్:బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. సోమవారం(సెప్టెంబర్23) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావ రణ శాఖ ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచే తెలంగాణ రాష్ట్రం తో పాటు ఏపీలో కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

రాష్ట్రంలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ.. రాష్ట్రంలోని 10జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రానున్న తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. 

ఆదివారం సాయంత్రం నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 

మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ALSO READ | హైడ్రా కూల్చివేతలు..8 ఎకరాలు స్వాధీనం

ఇక హైదరాబాద్ సిటీ లో ఆదివారం సాయంత్రం నుంచి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. 

సోమవారం నాడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్,చ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతోంది.