ఏపీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. అహోబిలం కొండలపై పడిన జోరువానతో.. పైనుంచి ఉదృతంగా వరద నీరు కిందికి దూకుతోంది. కొండల నుంచి నీళ్లు జాలువారుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురవలేదని స్థానికులు అంటున్నారు. అహోబిలం ఆలయంలోకి వరద నీరు చేరింది. వర్షాలతో అహోబిలం అడవుల నుంచి మొదలయ్యే భవనాశి నది జలకళను సంతరించుకుంది.