బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ( డిసెంబర్ 19,20) ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 19 గురువారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లో మత్స్యకారులను శనివారం వరకు వేటకు వెళ్లవద్దని ఐఎండీ తెలిపింది.