అమరావతి: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ, ఏపీలోని రాయలసీమ,కోస్తా ఆంధ్రాప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన.. రేపటికి ( సోమవారం సెప్టెంబర్ 23) అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. ఇదేగనక జరిగితే..రాగల మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ALSO READ | అల్లూరి జిల్లాలో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు మెడికోలు
సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు కోస్తాంధ్రా, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో, అర్థరాత్రి, తెల్లవారు జామున వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చ రిస్తోంది.