బెంగళూరులో భారీ వర్షాలు..సిటీ అంతా ఆగమాగం

బెంగళూరులో భారీ వర్షాలు..సిటీ అంతా ఆగమాగం

కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఈదురు గాలులకు చెట్లు నెలకొరిగాయి. గంటకు పైగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో పలుచోట్ల విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

బెంగుళూరు నగరంలోని బనశంకరి, జయనగర్, జేపీ నగర్, మైసూర్ రోడ్డు, జేసీ రోడ్డు, కేఆర్ మార్కెట్, హడ్సన్ సర్కిల్, కస్తూర్బా రోడ్డు, ఎంజీ రోడ్డు, శేషాధ్రి రోడ్డు, కనకపుర రోడ్డు, బళ్లారి రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

కాగా బెంగుళూరు నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడింది. నైరుతి రుతు పవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రవేశించాయని.. రానున్న రెండు రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉన్నందున  మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.