హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం చిరుజల్లులుగా మొదలైన వాన.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడుతోంది. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, సీతాఫల్ మండి, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, కోఠి, కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంట్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ట్యాంట్ బండ్ పై నిర్వహించిన దశాబ్ది ఉత్సావాలు త్వరత్వరగా ముగించాల్సి వచ్చింది.
రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, మేడ్చల్ జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.