హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఇయ్యాల అతిభారీ వర్షాలు..

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా కాప్రాలో 2.45 సెంటీమీటర్ల వాన పడింది. కూకట్ పల్లిలో రూ.1.80, కుత్బుల్లాపూర్​లో 1.60 సెంటీ మీటర్లర వాన కురిసింది. కొన్నిప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

 శుక్రవారం అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరెంజ్ అలెర్ట్(11.56 సెం.మీ. నుంచి 20.44 సెంటీ మీటర్ల వాన), అలాగే శని, ఆదివారాల్లో ఎల్లో అలెర్ట్(6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. వాన) జారీ చేశారు.