హైదరాబాద్ లో గాలి దుమారం.. వర్షం బీభత్సం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది.  గాలి దుమారంతో  పాటు చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.  జూబ్లీహిల్స్, బంజారాహీల్స్,  పంజాగుట్ట, అమీర్ పేట, యూసఫ్ గూడ,   కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గీర్ గుట్ట, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి లలో  ప్రాంతాల్లో గాలి దుమారంతో పాటు వర్షం పడుతోంది. 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.  

గాలి దుమారంతో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్  అయ్యింది. వాహనదారులు  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  కొన్ని చోట్ల కరెంట్ పోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.   చార్మినార్ ,ఖైరతాబాద్, శేర్ లింగంపల్లి, ఎల్బీ నగర్ లో జోన్ లో రెయిన్ వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది.

 విపరీతమైన ఈదురుగాలులు వీస్తుండటంతో జీహెచ్ఎంసీ  అలర్ట్ అయ్యింది. మరో రెండు గంటల పాటు ఈ గాలులు వీచే అవకాశమున్నందున నగర ప్రజలు బయటకు రావొద్దని సూచించారు అధికారులు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరించారు.