హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. రేపు(సోమవారం) భారీ వర్షాలు

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. రేపు(సోమవారం) భారీ వర్షాలు

హైదరాబాద్ లో ఆదివారం (జూలై14) వాన దంచికొడుతోంది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా  మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్ , నిజాంపేట్, ప్రగతినగర్ , పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్ పరిసర్  ప్రాంతాల్లో వర్షం పడింది. 

బంజారా హిల్ష్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ , మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ కురుస్తోంది. లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రికూడా హైదరాబాద్ సిటీలో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 

రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మరో రెండు రోజులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.