
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి,కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, కోఠి, కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం గంటకు పైగా కురుస్తుండటంతో జనం ఎక్కడికక్కడే స్తంభించిపోయారు.
గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలోనూ 2024, జూన్ 6వ తేదీ సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. మరోసారి హైదరాబాద్ లో వాన దంచికొట్టనున్నట్లు వాతావవరణ శాఖ తెలిపింది. జూన్ 7న సాయంత్రం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే..
భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. జూన్ 11 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.