హైదరాబాద్‌లో జులై 31 సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ రాత్రి సిటీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతున్న ప్రజలు జీహెచ్ఎంసీ సీడీఆర్ఎఫ్అధికారులను సంప్రదించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
సిటీ జనం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. సోమవారం.. జులై 31వ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలైన వాన.. మంగళవారం ఆగస్ట్ ఒకటో తేదీ ఉదయం వరకు కంటీన్యూ అవుతుందని.. సిటీతోపాటు శివార్లలోనూ వర్షం పడనుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది జీహెచ్ ఎంసీ.
ఈ క్రమంలోనే రాత్రంతా వర్షం పడితే.. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు రావటం, చెట్లు పడిపోవటం, ట్రాఫిక్ జామ్స్, కరెంట్ అంతరాయం వంటివి కలగొచ్చని.. ఇలా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. 040-21111111 లేదా 9000113667 నెంబర్లు కాల్ చేయాలని సూచించింది.
సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రోడ్లపైనే ఉన్నాయని.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే వెంటనే సహాయం అందుతుందని ప్రకటించింది.
హైదరాబాద్ లో మళ్లీ వర్ష బీభత్సం.. సోమవారం.. జులై 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ కాసినా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 4 గంటల నుంచి సిటీలో వర్షం మొదలైంది. ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ ఏరియాల్లో వర్షం దంచికొడుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులు వదిలే సమయం కావడం.. వరదతో ట్రాఫిక్ జామ్ తద్వారా ఉద్యోగులు ఇళ్లకు వెళ్లడానికి గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇవాళ ఉదయం జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మార్గంలో 5 కి.మీ. పరిధిలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.ఒక్కో వెహికిల్ ఇంటికి చేరడానికి కనీసం గంట సమయం పట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. అనూహ్యంగా పెరిగిన వాహనాల రద్దీతో ఏం చేయలేకపోయారు.
సాయంత్రం ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయం కావటంతో ఆందోళన నెలకొంది. భారీ వర్షంలో ఒక్కసారిగా ఐటీ తోపాటు ఇతర సంస్థల్లో పని చేసే ఉద్యోగులు రోడ్డెక్కితే.. ట్రాఫిక్ స్థంభించే పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం కారణంగా చాలా మంది ఆఫీసుల్లోనే ఉండిపోతారు.. వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా ఆఫీసుల నుంచి కార్లు, బండ్లు బయటకు తీసి.. రోడ్డెక్కనున్నారు. దీంతో సిటీలో ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సైతం సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆఫీసుల నుంచి ఒక్కసారిగా బయటకు రావొద్దని.. వర్షం తగ్గిన వెంటే అందరూ బయలుదేరొద్దని కోరుతున్నారు. కొంచెం సమయం తీసుకోవాలని.. దీంతో ఉద్యోగులు అందరూ విడతల వారీగా బయటకి రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకే సారి వస్తే విపరీతమైన ట్రాఫిక్ రద్దీలో చిక్కుకునే అవకాశం ఉండటంతో సహకరించాలని వారు కోరారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, చిక్కడపల్లి, బోడుప్పల్, పటాన్చెరు, శేరిలింగంపల్లి, లింగంపల్లి, హయత్‌నగర్, గచ్చిబౌలి, కోకాపేట, ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్, కూకట్పల్లి, చందానగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, అమీర్‌పేట, సికింద్రాబాద్, హుస్సేన్‌సాగర్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది.