- చెట్టు పడటంతో కూలిన గుడి, ఒకరికి గాయాలు
సుజాతనగర్, వెలుగు: ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. సుజాతనగర్ నుంచి సీతంపేట వెళ్లే దారిలో ఉన్న ముత్యాలమ్మ గుడి పక్కనే ఉన్న భారీ తుమ్మ చెట్టు ఒక్కసారిగా విరిగి గుడిపై పడింది. దీంతో గుడి పూర్తిగా కూలిపోయింది. వర్షం, ఈదురుగాలులతో గుడిలో ఆగిన ఒక వ్యక్తి పై కొమ్మలు పడడంతో గాయాలయ్యాయి. అక్కడే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.
స్థానికులు గుడి వద్దకు చేరుకుని కొమ్మలు తొలగించి గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. దేవాలయం కూలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.