నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు టౌన్‌లోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కటౌట్లు కూలాయి. అంబేద్కర్ సెంటర్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలి మెయిన్‌రోడ్‌పై పడిపోవడంతో ములుగు రూట్లో ట్రాఫిక్జామ్ఏర్పడింది.
కూలిపోయిన రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.