
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షం పడుతుంది. 24 గంటల్లోనే రెండోసారి భారీ వాన పడుతుంది. 2024, జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం పడుతోంది.
ప్రస్తుతం నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, సోమాజిగుడ, ఖైరతాబాద్, లకిడికపూల్, బేగంపేట్, సికింద్రాబాద్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, ఎల్ బీ నగర్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్, రామాంతపూర్, కాచిగూడ, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, బషీర్ బాగ్, అబిడ్స్, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఆఫ్జల్ గంజ్ తరదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరుకుంటోంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు.. సిబ్బంది అప్రమత్తం చేసింది. రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.