ఏపీలో భారీ వర్షాలు..ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మరో పక్క బంగాళాకాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ తుఫానుకు రేమాల్ తుఫానుగా నామకరణం చేసినట్లు తేలిపోయింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ పై ఈ తుఫాను ప్రభావం ఉండదని , మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.