- ఇవాళ ,రేపు కూడా కుండపోత వానలు పడతాయన్న వాతావరణ శాఖ
- ఒక్కరోజులోనే 4.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత
- కరీంనగర్ జిల్లా ఎదులగట్టెపల్లిలో అత్యధికంగా 27..సెంటీమీటర్ల వాన
- గత పదేళ్లలో ఆగస్టు నెల వానల రికార్డు ఇదే
- ఈ ఏడాది ఇప్పటి వరకు 30 శాతం అధికంగా వానలు
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ ,కరీంనగర్ జిల్లాల పరిధిలో అయితే రికార్డు స్థాయిలో పడుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి. చెరువులు ,కుంటలు కళకళలాడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ తో వానలు పడుతున్నాయని..గత పదేళ్లలో ఆగస్టు నెలలో ఇంతలా వానలు పడటం ఇదే రికార్డు అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. 2018లో రామగుండంలో 26.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిందని.. తాజాగా కరీంనగర్ జిల్లాలోని ఏదుల గట్టెపల్లిలో ఏకంగా 27.3 సెంటీమీ టర్లవాన పడిందని చెప్పారు. మరో రెండు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
ఒక్క రోజులోనే ఐదు రేట్లు ఎక్కువగా..
వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నా యి. అయితే శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం దాకా అతి ఎక్కువ వర్షపాతం నమోదైంది. స్టేట్ డెవ్ లప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. ఈ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 47.7 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. ఈ సీజన్ లో ఒక రోజులో నమోదైన అత్యధిక వరపాతం ఇదే. ఇదే నెల 10న 32 మిల్లీమీటర్లు, జూన్11న 31 మిల్లీమీటర్ల సగటు రెయిన్‌ఫాల్ రికార్డయ్యింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దంచి కొడుతోంది
రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి దాకా కుండపోత వానలు పడ్డాయి. తొమ్మిది చోట్ల అత్యంత భారీగా, 20కిపైగా ప్రాంతాల్లోభారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్, వరంగల్ రూరల్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ అర్బన్, ములుగు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో విస్తారంగా పడ్డాయి. అర్బన్ ప్రాంతాల వారీగా చూస్తే దేశంలోనే వరంగల్ అర్బ న్‌లో అత్యధిక వర్షపాతం రికార్డయింది. కరీంనగర్ జిల్లాలోని ఏదులగట్టెపల్లిలో ఏకంగా ఒక్కరోజే 27.3 సెంటీమీటర్లవాన పడింది. వరంగల్‌రూరల్ జిల్లాలోని నల్లబెల్లిలో 27 సెంటీ మీటర్లు, దుగ్గొండిలో 26, మేడిపల్లిలో 24.8, లక్నెపల్లిలో 24.4, పరకాలలో 22, సిద్దిపేటలోని కొహెడలో 21.4, వరంగల్‌రూ రల్‌లోని సంగెంలో 21, పాలకుర్తిలో 20, దామెరలో 20, వరంగల్‌అర్బన్‌లోని కమలాపూర్‌లో 20, కరీంనగర్‌లోని బొర్నపల్లిలో 19.6, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 19.5, కరీంనగర్‌జిల్లా ఇందుర్తిలో 19.4, వరంగల్ అర్బన్‌లోని పైడపల్లిలో 18.2, ములుగు జిల్లావెంకటాపురంలో 18.1, వరంగల్ అర్బన్‌లోని ములుగు రోడ్డులో 18, ధర్మసాగర్‌లో 17.7, వరంగల్‌రూరల్‌లోని నడికుడలో 17.5 సెం టీమీటర్లచొప్పున వర్షపాతం నమోదైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో మోస్తరు వానలు పడ్డాయి. ఆకాశం మబ్బుపట్టిపొద్దం తా చినుకులు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఏదులగట్టెప ల్లిలో మళ్లీ 9 ళ్లీ సెంటీమీటర వాన పడింది.
32 జిల్లాల్లో మస్తు వానలు
ఈ ఏడాది వానాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్ప టిదాకా సాధారణం కంటే ఎక్కువ వానలు పడ్డాయి. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 485.9 మిల్లీమీటర్లసగటు వరపాతం ్ష నమోదుకావల్సి ఉండగా.. 632.7 మిల్లీ మీటర్లు రికార్డయ్యింది. అంటే 30శాతం ఎక్కువగా కురిసింది. ఆగస్టు నెలలోనే సాధారణం కంటే 71 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. జూలైలో 9శాతం, జూన్‌లో 34 శాతం ఎక్కువగా కురిశాయి. రాష్ట్రవ్యా ప్తంగా ఏడు జిల్లాల్ లోఅతి ఎక్కువగా, 14 జిల్లాల్లో ఎక్కువగా, 11 జిల్లాల్లో నార్మల్‌గా, ఒక జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఆది, సోమవారా ల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
20 వేల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పంటలు దెబ్బతింటున్నాయి. పంట చేలో నీరు నిలుస్తోంది.పూత, కాత దశలోఉన్న పత్తి పంటకు తీవ్రనష్టం కలుగుతోంది. కంది, పెసర్లు, మినుము చేలో కూడా నీళ్లు నిలుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్నవానలతో ఇప్పటి వరకు 20 వేలఎకరాల్లో పంటదెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాతో ప్రభుత్వానికి శనివారం రిపోర్ట్ చేసింది. ఇందులోఅత్యధికంగాపత్తి 7,500 ఎకరాలు, వరి 5,700 ఎకరాలు, కంది3 వేల ఎకరాలు ఉంది. పెసర్లు వెయ్యి ఎకరాల్లో, సోయాబీన్ ఐదువందల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఏడు జిల్లాల్లోని 36మండలాల్లో 9 వేలమంది రైతులునష్టపోయారు. వికారాబాద్, గద్వాలజిల్లాల్లోనే 35 నుంచి 85శాతం పంటలు ఎఫెక్ట్ అయ్యాయి. వనపర్తి,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,మహబూబాబాద్జిల్లాల్లో 33శాతంలోపుపంట దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.