హైదరాబాద్ లో కుండపోత.. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దొ

  • పొంగిపొర్లుతున్న వాగులు.. వందలాది ఊర్లకు రాకపోకలు బంద్
  • వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకరు..కామారెడ్డి జిల్లాలో కరెంట్ ​తీగలు తెగిపడి మరొకరు మృతి
  • సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో 30 సెం.మీ. వర్షపాతం
  • ఇయ్యాల, రేపు భారీ వర్షాలు..9 జిల్లాలకు రెడ్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు రేపు సెలవు 
  • డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇరిగేషన్ ఆఫీసర్లకు సెలవులు రద్దు 
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ ఆదేశం 

హైదరాబాద్/నెట్​వర్క్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ మొదలు దక్షిణ తెలంగాణ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచే వాన మొదలై.. శనివారం ఉదయానికి పుంజుకుంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ధాటికి వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకరు, కామారెడ్డి జిల్లాలో కరెంట్​తీగలు తెగిపడి మరొకరు మృతి చెందారు.

 కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద‌‌‌‌‌‌‌‌ర్ అన్ని జిల్లాల క‌‌‌‌‌‌‌‌లెక్టర్లు, ఎస్పీలు, పోలీసు క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్లు, కార్పొరేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, మున్సిప‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి ప‌‌‌‌‌‌‌‌రిస్థితుల‌‌‌‌‌‌‌‌ను ఎప్పటికప్పుడు స‌‌‌‌‌‌‌‌మీక్షిస్తూ త‌‌‌‌‌‌‌‌గిన చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో 30 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. అదే జిల్లా చిల్కూరులో 28.2, మఠంపల్లిలో 25.6 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా తాడ్వాయి హట్స్‌‌‌‌లో 23.1, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.3, మధిరలో 20.3, సూర్యాపేట జిల్లా తొగర్రాయిలో 19, ముకుందాపురంలో 18, రఘునాథపాలెంలో 17.8, ఇనుగుర్తిలో 17.7, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 16, కామారెడ్డి జిల్లా బొమ్మదేవనపల్లిలో 14.7, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 14.5, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 14.4, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 14.1 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 28 చోట్ల 10 నుంచి 13 సెం.మీ. మధ్య వర్షం పడింది‌‌‌‌.

హైదరాబాద్​లో 59 షెల్టర్ హోమ్స్ 

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. జిల్లాలో 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించాలని సూచించారు. ‘‘రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్​ అండ్ బీ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్​​లోని కంట్రోల్ రూమ్​నెంబర్ 040--23202813/90634 23979, హైదరాబాద్ ఆర్డీవో 74168 18610/99851 17660, సికింద్రాబాద్ కు సంబంధించి 80197 47481 నంబర్లకు ఫోన్ చేయాలి” అని వెల్లడించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని స్కూళ్లకు సోమవారం సెలవు ఇస్తున్నట్టు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయి డెడ్​ స్కూళ్లకు సెలవు ఉంటుందని చెప్పారు. మరోవైపు పరిస్థితులను బట్టి సోమవారం సెలవు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.  

హైదరాబాద్-విజయవాడ హైవే జామ్

సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం రాత్రి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌‌ జామ్ అయింది. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారిపైకి మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని సూచించారు.

స‌‌‌‌హాయక చ‌‌‌‌ర్యలు చేప‌‌‌‌ట్టండి : సీఎం  

భారీ వ‌‌‌‌ర్షాల నేప‌‌‌‌థ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమ‌‌‌‌త్తంగా ఉండాల‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం సీఎస్​శాంతికుమారితో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌‌‌‌ర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిప‌‌‌‌ల్‌‌‌‌, విద్యుత్‌‌‌‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమ‌‌‌‌త్తంగా ఉండేలా చూడాల‌‌‌‌ని సీఎస్‌‌‌‌కు సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛ‌‌‌‌నీయ సంఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లు చోటుచేసుకోకుండా చూడాల‌‌‌‌ని, లోత‌‌‌‌ట్టు ప్రాంతాల ప్రజ‌‌‌‌ల‌‌‌‌ను త‌‌‌‌క్షణ‌‌‌‌మే స‌‌‌‌హాయ‌‌‌‌క శిబిరాల‌‌‌‌కు త‌‌‌‌ర‌‌‌‌లించాల‌‌‌‌ని  ఆదేశించారు. 

రిజ‌‌‌‌ర్వాయ‌‌‌‌ర్ల గేట్లు ఎత్తుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజ‌‌‌‌ల‌‌‌‌ను అప్రమ‌‌‌‌త్తం చేయాల‌‌‌‌న్నారు. అలాగే, వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. కమిషనర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశామన్నారు. 

ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే?

  •     వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకరు మృతి చెందారు. శ్రీరంగాపూర్ మండలం తాటి పాములకు చెందిన వడ్డే చంద్రయ్య (70) శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. పాత ఇల్లు కావడంతో వర్షానికి కూలి నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. జిల్లాలో 8 మట్టి మిద్దెలు కూలినట్టు తెలిసింది. 
  •     కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచ్​పల్లిలో ఓ రేకుల ఇంటిపై ఈదురుగాలులకు కరెంట్​ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో తలుపులు పట్టుకున్న స్వాతి (18) అనే యువతి ప్రాణాలు విడిచింది. 
  •     ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వాగులో సాంబ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. 
  •     ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర్లో శనివారం సాయంత్రం మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దొంగలవాగు ఉధృతికి కొట్టుకు పోయింది. అప్రమత్తమై ప్రయాణికులు బస్సు దిగడంతో ప్రమాదం తప్పింది.  
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు ఏరియాల్లో ఓపెన్​కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామ సమీపంలో పాలవాగుపై నిర్మించిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
  •     పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.  
  •     నారాయణపేట జిల్లాలో బండగొండ వాగు దాటుతూ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న కొందరు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. చిన్న చింత కుంట మండలం ముచ్చింతల చెరువుకు గండి పడింది. మక్తల్​లోని సంగం బండ రిజర్వా యర్ ​కు​ పెద్ద మొత్తంలో వరద రావడంతో ఆఫీసర్లు 4 గేట్లు ఎత్తారు.
  •     నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో పలు వార్డులు జలమయమయ్యయి. ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. నల్లమలలో ఉమా మహేశ్వర దేవాలయం వరద నీటిలో చిక్కుకుంది. 
  •     కరీంనగర్ సిటీలో 150 ఏండ్ల నాటి పురాతన పాండురంగ దేవాలయం స్లాబ్ పైకప్పు, గోడలు విగ్రహంపై విరిగిపడ్డాయి. 
  •     నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయా యి. నల్గొండ టౌన్​లో పలు కాలనీలు నీటమునిగాయి. 
  •     భారీ వర్షానికి సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ ఆఫీస్​లోకి నీరు చేరింది. 
  •     మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రధాన రహదారిపై నీళ్లు నిల్వడంతో వరంగల్ - ఖమ్మం మధ్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.