అలర్ట్... తెలంగాణలో రాబోయే మూడు రోజులు వానలే

అలర్ట్...   తెలంగాణలో రాబోయే మూడు రోజులు వానలే

తెలంగాణలోఈరోజు(జూన్ 27) వ తేదీ గురువారం రోజున అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.  అదిలాబాద్,  కొమరం భీం ఆసిఫాబాద్,  మంచిర్యాల,  నిర్మల్,  నిజామాబాద్, జగిత్యాల,  రాజన్న సిరిసిల్ల,  కరీంనగర్,  పెద్దపల్లి,  జయశంకర్ భూపాలపల్లి,  ములుగు,  భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో అక్కడక్కడ వర్షాలు  కురిస్తాయని వెల్లడించింది.  

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‎నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.  ద్రోణి , ఆవర్తనం  కారణంగా రాష్టంలో  ఈరోజు నుంచి మరో మూడు రోజులు  వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మరోవైపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  దీంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు.    ఏది ఏమైనా ఈ మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.