తెలంగాణ వ్యాప్తంగా బలమైన రుతు పవనాలు విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ వారం(జూలై 8) సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.
హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒకటి తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో అంటే జూలై 10 నుంచి 25 తేదీల మధ్య కాలంలో ఒకటి లేదా రెండు అల్పపీడన ప్రాంతం(ఎల్బీఏ) ఏర్పడం ద్వారా భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక హైదరాబాద్ లో జూలై 13 నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూలై 8 నుంచి జూలై 12 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండ, ఖమ్మం, మెదక్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చిరింది.