గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక వర్షాపాతం ఇక్కడే

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక వర్షాపాతం ఇక్కడే

తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణాల్లో వీధులు వాగులుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదైంది. శనివారం ఉదయం 8గంటల నుంచి ఆదివారం ఉదయం 7గంటల వరకు నమోదైన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి. 

అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఈ వర్షాలకు ప్రభావితం అయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలో రికార్డ్ స్థాయిలో అత్యధిక వర్షపాతం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలంలో 43.8 సెం.మీ వర్షపాతం పడింది. చిన్నగూడురు మండలం 42.85, నెల్లికుదురులో 41.65, పెద్దనాగారం 40.28 సెం.మీ వర్షాపాతం నమోదైంది.

Also Read :- వర్షాలపై సర్కార్ హై అలర్ట్

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 43.5, సూర్యాపేటలోని మద్దిరాల మండలం ముకుందాపూరంలో 42.5 సెం. మీటర్ల వర్షాపాతం నమోదైంది. జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహయక చర్యలు ప్రారంభించారు. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలు సంభించిపోయాయి. పలు వాగులు కట్టలు తెగి.. వంతెనలు కూలిపోయాయి. జిల్లా హెడ్ క్వర్టర్ లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. రెస్య్కూ టీంలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.