తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

తెలుగు రాష్ట్రాల్లో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అధికారులు.

Also Read:- దంచికొడుతున్న వానలు

వరద ఉదృతి పెరిగిన క్రమంలో పోలవరం స్పిల్ వే వద్ద 28.9 మీటర్ల నీటిమట్టం నమోదయ్యింది. దీంతో 48గేట్ల నుండి 12వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. లంకా సాగర్, బేతుపల్లి ప్రాజెక్టుల్లో అలుగు పారుతోంది. లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 16అడుగులు కాగా, 6అంగుళాలకు పైగా అలుగు పారుతోంది.