![తిరుమలలో భారీ వర్షాలు.. కుప్పకూలిన పెద్ద చెట్టు..](https://static.v6velugu.com/uploads/2024/07/heavy-rains-in-tirumala-and-big-tree-fallen-on-road_na1C8ODIqk.jpg)
ఏపీ తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి ఈదురు గాలులతో కూడిన వాన పడింది. దీంతో తిరుమల బాట గంగమ్మ గుడి దగ్గర పెద్ద చెట్టు కూలిపోయింది. దీంతో పార్కింగ్ లో ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిన చెట్టును తొలగించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇటీవల తిరుమలలో జాపాలి తీర్థం దగ్గర కూడా చెట్టు కొమ్మ విరిగి ఓ భక్తురాలి మీద పడింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై చెట్టు కొమ్మ పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.కుప్పకూలిన మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.