హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు పెద్ద పెద్ద వృక్షాలు రోడ్లపై పడినప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఇటు బంజారాహిల్స్, పంజాగుట్ట, బాలానగర్, జీడిమెట్ల, దుండిగల్ ఏరియాల్లో వర్షం భారీగా కురుస్తోంది. కుత్బుల్లాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్రలో కుండపోత వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరిలో జోరు వాన పడుతోంది. కాప్రా, కుషాయిగూడ, అల్వాల్, నాగారం, దమ్మాయిగూడతో పాటు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.